పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

పడవ బయలుదేరి పోవుటవిని, బెంజమిను ఖిన్నుడై, ఏమియుదో చక, తిరిగి యాముదుసలి దానివద్దకువచ్చి, జరిగిన సంగతి నామెతో జెప్పెను; అతడుండు మంగళవారము వఱకు తన గృహమున బసచేయు మని యామె కోరినందున, మార్గాయాసముచే బడలిన బెంజమి నందుకు సమ్మతించెను.

ఒకనాడు సాయంకాలమందు; నదీతీరమున విహరించుచుండ, దైవికముగ, రాధారి మనుజుల నెక్కించుకొని ఫిలడల్‌ఫియాకు బోవు పడవను బెంజమిను చూచెను. ఇతనిని తీసికొని వెళ్లుటకు పడవవా రంగీకరించినందున, పడవలోనికి బెంజమిను వెళ్లెను. గాలిలేనందున, వీరుపడవను నడుపవలసి వచ్చెను. ఆదివార ముదయమున, 8, 9 గంటలకు "ఫిలడల్ ఫియాకు" పడవచేరెను. ఇతని వద్ద కొన్ని రాగిడబ్బులు, మూడురూప్యములు మాత్రముండెను. ఇతనుకూడ పడవను నడపినందున, నితని వద్ద రుసుము పుచ్చుకొనుటకు కళాసు లిష్ట పడక పోయిరి. అయినను, వారిని నిర్భంధముచేసి, తన రాగిడబ్బు లన్నియు బెంజమిను వారి కిచ్చివేసెను. "ధనము కలిగియున్న సమయములలో గాక, ధనము లేని సమయములలోనే, మనుజుడు తన యౌదార్యమును జూపించును. తనవద్ద కొంచెము ధనమున్నదని నితరులకు తెలియకుండుటకు కాబోలు వాడిటులు చేయును" అని బెంజమిను వ్రాసెను.