పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

తనవలె చైతన్యము, స్వభావము, మమకారములు గలవని తెలిసికొన మార్గముండును.

ఈడు వచ్చి సంతానవంతుడైన పిదప, తండ్రితో సహ పంక్తిని కూర్చుండెడు పన్నెండుగురు సోదర సోదరీలను బెంజమిను ఫ్రాంక్లిను జ్ఞప్తికి దెచ్చుకొనుచుండును. బాల్యావస్థలో తమ గృహమందు బొందిన సౌఖ్యమునకు, నితడును, ఇతని చెల్లెలు జేనును, నిదర్శనులయి యున్నారు. "సంసార పక్షముగనున్న మన గృహములో బెరిగితిమి. లెస్సగ దిండితిని, కోరిన వస్త్రములను గట్టుకొని, చలి కాచుకొనుచు, మనలో నేవిధమైన యంకిలిలేక, కలసి మెలసి యుండెడి వారము. పెద్ద లంద అనుకూలముగ నుండెడివారు. సర్వత్ర, వారు గౌరవమును బొందుచు వచ్చిరి" అని ఈమె వ్రాయుచున్నది.

బోస్టను పట్టణమందు నానాటికి వృద్ధిబొంది, జోషయా ఫ్రాంక్లిను ధనికుడాయెను. ఇంగ్లాండు దేశమం దుండిన నితని తమ్ముడు, బెంజమిను, ధనికుడు గా లేదు. బంధువులకు స్నేహితులకు వాత్సల్యమును గనబఱచి, అతడు సుగుణ సంపత్తులను గలవా డయ్యెను కాని సర్వకాల సర్వావస్థలయందు నుండవలసిన కొన్ని గుణములు అందు ముఖ్యముగ రాజ్యక్రాంతి క్షోభలు సంభవించునెడ తాను స్థానభ్రంశ మంద కుండుటకు