పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

సామానులు హెచ్చుచుండె" నని కూడ బెంజమిను వ్రాసెను. వివాహమైన కొన్నిరోజుల కీ ముచ్చట జరిగెను. ఇతని వ్యవహారమైనను బాగుగాలేదు, నిండులేదు, వెల్తి లేదు. పనులన్నియు స్వయముగ నతనిచేత జేయబడుచుండెను. ఈ సమయములో, సర్వజనోప యోగ్యమైన పుస్తక భాండాగారమును స్థాపించుటకు దగిన బ్రయత్నముల నితడు జేసెను.

"జంటో" సమాజము స్థాపించినపుడు, స్వంతమందిరమేదియు దానికి లేదు. సమాజములోనివాడు 'రాబర్టుగ్రేసు' కరుణతో నొక గది నిచ్చినందున, దానిలో సమాజమువారు కూడుచుండిరి. వివాదాంశములను విశదీకరించుటకు సభ్యులు కొన్ని పుస్తకములను సభకు తీసికొనివచ్చి, పని ముగిసినపైని, వానిని తమ గృహములకు దీసికొనిపోవుచుండిరి. మందిరములో నొక గదిలో ప్రతిసభ్యుడు తన పుస్తకముల నుంచుటవలన, వానిని జదువుట కందఱికిని వీలగు నని బెంజమిను ముచ్చటించెను. వల్లెయని యందఱంగీకరించిరి. మందిరములో బుస్తకము లుంచబడెను. వానిని వాడుకొను నేర్పు సమానముగ నందఱు కలవారుకారు గనుక, కొన్ని పుస్తకములు మాసిపోయినవి. అందుచేత, వీని యజమానులు విసిగికొని, తమపుస్తకములను స్వగృహములకు దీసికొనిపోయిరి. అటులందఱు చేసిరి. పుస్తకములను గొనుటకు శక్తిలేని సంసారు లిదివఱకు వీనిని చదువుట