పుట:BashaChaaritrakaVyasavali.djvu/195

ఈ పుటను అచ్చుదిద్దలేదు

21. గసగస : ఒక దినుసు మసాలా విత్తులు; నల్లమందు విత్తులు (ఆంధ్రపద పారిజాతము, పు 184) ' గసగస లివయును. (భీమ. 3-57). 'గసగస యొసక మెసగె (కాశీ. 3-23), గసగసలు ' (పైది. 7-185), ' గసగసలు చాఱపప్పు ' (రుక్మాం. 3-6)<పారసి. ఖష్‌ఖాష్: గసగసాలు: the minute seeds of the poppy plants. This is corrupted from the Arabic name 'khash khash' Ains1. 1.326 (బ్రౌణ్యము. ప్రథమ ముద్రణము, పు 204). గసగసాలనుట పునరుక్తియను భ్రమవలన కాబోలు ' గసాలు ' అనంతపుర మండలము వారి వాడుక.