ఈ పుట ఆమోదించబడ్డది
హయగ్రీవాయనమః.

బాల వ్యాకరణము.

సంజ్ఞా పరిఛ్చేదము.

1. సంస్కృతమునకు వర్ణము లేఁబది.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ - - ఏ ఐ ఓ ఔ అం అః || క ఖ గ ఘ జ్న చ ఛ జ ఝ ఇన్ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ || ఇం దకారాదు లచ్చులు - కకారాదులు హల్లులు - అజ్ఝల్విభాగ మీలాగుననే మీద నెఱుంగునది.

2. ప్రాకృతమునకు వర్ణములు నలువది.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అః || క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స హ ళ || కొందఱ మతంబుల హ్రస్వవక్రంబులును బ్రాకృతంబునందు గలవు. కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు. ఎ ఏ ఒ ఓ లు వక్రములులని, ఐ ఔ లు వక్రతమములని ప్రాచీనులు వ్యవహరింతురు.

3. తెనుఁగునకు వర్ణములు ముప్పది యాఱు.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః || క గ చ - జ - ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ.