ఈ పుటను అచ్చుదిద్దలేదు
11]

81

బా ల నీ తి.

పార్వతీదేవినిజేరి వాఱిద్దరినిగాంచెను. అంతదనవఖుడు చల్లనిగాలితోగూడికొనిన పుష్పపరిమళమెల్లెడ వ్యాప్తి జేయుచుండ దానాయీశ్వరునిపై నస్త్రముంబ్రయోగించు చుండ నది చేతినుండిజాఱెను. తిరిగి యాస్త్రము నతడు తీసికొని సమ్మోహనమను వస్త్రమును బ్రయోగించెను. వెంటనే యాయీశుడు "ఎవడిటులనాపై నస్త్రముం బ్రయోగించువాడు. నేనురుద్రుడనని యామదాంధునికి దెలియదుకాబోలు. నాతపము భంగముజెసె" నని రౌద్రముకలవాడై భ్రుకుటి ముడివడ మూడవనేత్రము ను విప్పి యాకసమున దేవతలందఱు "కోపముసంహరింపు డుపసంహరింపు" డను పలుకులు పలుకుచున్నంతలో నాయస్త్రమును బ్రయోగించిన మన్మధుని భస్మావశేషునిగా నొనరించెను.

   చూచితిరా! ఆమన్మధు డటుల నాశనమగుటకు గారణమేమి? ఇంద్రుని ముఖస్తుతియేకదా? తనసఖీసఖులిరుగురు వద్దివద్దన్నను నాపని నొప్పుకొనుటకు గారణమేమి? ఇంద్రునిముఖస్తుతి యేకదా? కాబట్టి యెవరైన నిచ్చకపుముచ్చటల కిచ్చగింతురేని నిటులనే వారికి గీడులు మూడగలవు. కాన మనము ముఖస్తుతికి లొంగి  యేపనిలోను బ్రవేశించకూడదు. ఆముఖస్తుతిసేయువానిపని మచిదా? లేక చెడ్డదా" యని విచారించి మంచిదైన యెడల సహాయముజేయవలయును. అంతియకాని ముఖస్తుతివలన లొంగి యె