ఈ పుటను అచ్చుదిద్దలేదు

79

బా ల నీ తి.

కు లొంగియుండవలసివచ్చును. ఇక ముఖస్తుతి సేయువారి పలుకులు మనకు ములుకులై పీడించు చున్నను తదుపరి నెక్కువనద్యశమొందునటుల జేయును. ఈముకస్తుతి నంగీకరించి ప్రవర్తించుచుంటి మేని మోసపొయి చెడకయుందుము. కాన నొకపరియైన నొకడువచ్చి మనముందట నిచ్చకపు మటలాడుచువచ్చిన వాని నావలకు దఱిమి "యిటుల నిక నాదగ్గఱ ముఖస్తుతిసల్పకు" మని హెతొపదేశము జేయవలెను.

   ఇటుల ముఖస్తుతివలన మోసపోయి చెడినవారలు పూర్వులలో గొందఱు కలరు. వారిలో నొకరిని దార్కాణ ముగా జూపెద.
   మున్ను తారకాసురినివలన బాధలబదుచు దేవతలు హవిర్భాగములు లేకుండ నుండిరి. దీనిని దేవేంద్రుడుకాంచి తమకు వానిని నిర్జించుటకు శక్తిలేమిచే బ్రహ్మనురావించి తమబాధలు దెలియ పఱచి వానిని సంహరించుట కుపాయము చెప్పుడని వృచ్చించెను. అంత నాతమ్మిచూలి "ఇంద్రా! ఆతారకా సురుని జయించుట కీశ్వరునిపుత్త్రుడు తప్ప మన మెవ్వరముజాలము. కానాయీశ్వరునికి బుత్రోద్బవ మగునటుల నుపాయమాలొచింపు" మని యంతర్దానమాయెను. అంత నింద్రుడటులనె చిరికాల మాలోచించి తనభటునిచే విష్ణుకుమరుండగు మారుని రావించి ప్రత్య్లుత్దానపూర్వకంబుగ నుచితాసనంబిడి కుశలమును బరామర్శజెయుచు