ఈ పుటను అచ్చుదిద్దలేదు
74

బా ల నీ తి.

తినందుటయు మొదలగునవి వీనినిజేయుటకు దమకు శక్తిలేనియెడల జేతనైనంత సహాయము ఛేయవలెను. వీరలు కీర్తివంతులకి కించిత్తుకూడ సందియము లేదు.

   మనకున్నదానిలో గొంచెమిచ్చినను పేదయెక్కువగా నానందమందుననియు మనకున్న దానినంతయు నిచ్చినను ధనవంతుడామోదమును జెందడనియు, నభయదానంబొసంగిన నేప్రాణికయై నను సంతోషించుననియు మనము తెలిసికొనవలయును.
    ఇటులదానమొసంగి కీర్తిగాంచినవారలు మనపూర్వులలో జాలమంది కలరు. వారిలో నొకరిని జూపించుచున్నాను. సకలనీతివిశారదుడగు శిబియను రాజర్షి యజ్ఞంబమోఘంబుగా జేసినసర్వజనులకును మృష్టాన్నమిడియధ్వర్వులు సంతోషించునటుల దక్షిణ లొసగి చేయదగిన దానంబులెన్నికలవో వాని నన్నిటిని యధావిధిగా నొనరించి లోకముచే "లోకోత్తర దాతృశిఖామణి" యని బిరుదమునంది యుండెను. ఈ సంగతి  స్వర్గలోకంబున విని వెఱగంది యింద్రుడును, నగ్నియు, నీతనిగుణంబుల బరీక్షించుటకై తలంచిరి. తరువాత వారిద్దఱిలోనింద్రుడు డేగయై యనలుడు పావురమై బయలుదేఱిరి. ఆడేగవలన నీపావురము భయమొందుచున్నట్లు పరుగిడును. ధర్మజ్ఞానుడగు నాశిబి చక్రవర్తిని శరణు జొచ్చెను. అటుతరువాత నాస్యేన మాకపోతమును దఱుముచు  వచ్చుచుం

ట నాకపోతమాశిబిమహారాజు సమీపమున నుండుట