ఈ పుటను అచ్చుదిద్దలేదు
72

బా ల నీ తి.

యావణవీధికరిగి యమ్ముటకు జూపును. కాన మనమట్టివానికి దానముచేయరాదు. మనమొక ధనవంతునిబిలిచి సంబావించి పదిరూప్యములిచ్చితి మని యనుకొనుడు. వాడుతాధనవంతుడనని గర్వించుచు మనమిచ్చిన దానిని నిర్లక్ష్యముచేయుచు సపహసించు చుండును. కాన ధనవంతులకు దాన మొనరించ గూడదు. దురభిమానియగు నొకనిని విందునకుబిలిచిషడ్రసోపేతంబగు పరమాన్నంబు బెట్టితి మని యనుకొనుడు. వాడు మనమిడినవిందును నెందుకు గఱగానిదానిగా నొనరించుచు దననెచ్చెలుల వద్ద వదరుచుండును. కావున దురభిమానులకు దానము గావించ గూడదు. వీరలకు దాన మొసంగుట "నీటిలోనివ్రాతయె" యని నమ్ముడు. సుగుణములతొ గూడికొనిన బీదవారల కన్నమిడినను దబ్బు నిచ్చినను మరియేదానము జేసినను ఫలవంతమ గును. తగినకాలమునందు జక్కనిపనిజేసిన నేదియైనను ఫలించును గదా. కానధనికి దురభిమానికి, వాచాటునికి, గ్రుద్ధునికి,లోభికి, దానము ముమ్మాటికిని చేయ గూడదు. మంచివారలకు జేయుచుండవలెను.

    ఇటుల దాన మొనరించుట మనుజుల కేకాకసత్స్వభావముగల తిర్యగ్జంతువులకు దానము జేయవచ్చును. ఇదియుగూడనుత్తమము. వీనికి దానముచేయుట యెట్లన? చీమలు మొదలగు మంచిపురుగులకు చక్కెరమున్నగు మధుర పదార్దములు జల్లుచుండవలెను. పశువులు నీరుత్రాగునటుల దటా