ఈ పుటను అచ్చుదిద్దలేదు

63

బా ల నీ తి.

రీరము ప్రకాశించునేరదు. కాని పరోపకారముచేత నది ప్రకాశించగలదు. అనగా మనుజునకు బరోపకారము జేయుట పరమార్దమని ముఖ్యాభిప్రాయము.

    మనము సతతము పరోపకారము జేయుచుండిన గీర్తివంతులము కాగలము.
    ఈవిధముగా బరోపకారము గీర్తి జెందిన వారలలో నొకరిని జూచించు చున్నాను.
     మున్ను కుంతీదేవి తనసుతులతో నేకశిలా నగరంబున నొక బ్రాహ్మణునిగృహంబున గారణాంతర ముగ గాపురము జేయుచుండెను. ఇటులుండ నొక దినమున దాము నివసించు గృహయజమానుడు మొదలగువా రేడ్చుచుండిరి. ఇదియేమి? ఈరోదన మెచ్చటిదని విస్మయంబందుచు గుంతీదేవి వారలను "మీరేలగాకిగోలగా నేడ్చుచున్నారు? మీకేమి యాపద గలిగెను? దానినిపుడే పోగొట్టి సుకులనుగా మిమ్ము జేయగలను. కాన గారణముల దెలియబరచు" డని యడిగెను. అంతట నాగృహ యజమానుడామెతో "అమ్మా! ఈగ్రామమునోబకుం" డను రక్కసుడొకడు గలడు. వాడు ప్రతితిన మొక్కొక్క యింటిలోజొచ్చి యానికేతనమున నుండు వాఱలనందఱిని జంపి తినుచుండెడివాడు. వానిని నిర్జించుటకు మాపురవాసులకు గాని మారాజులకు గాని శక్తిలేకపొయెను. అంతట బౌరులారక్కసుని