ఈ పుటను అచ్చుదిద్దలేదు

61

బా ల నీ తి.

        సుజనులు తమసుఖములనైన విడిచి పరుల కుపకారమొనరించు చుందురు. ఎవడు తన శరీరమును, బుద్దిని, ధనమును, బరోపకారమునకై యుపయోగించు చున్నాడో వాడే వంధ్యుడు. వాడే స్వార్దపరత్యాగి. పరానుగ్రహ తత్పరులకు బరుల కుప కారమొనరించుట చిత్రమైన విషయముకాక స్వాభావిక మగుచున్నది. సుజనుడు జన్మించుట పరోపకారార్దమే కదా. చందనతరువులు స్వదేహశైత్యార్దమై జనించక పరుల సంతాపమును హరించుటకై జన్మించినవికదా. మనము మనశరీరాదులనెటుల జాగ్రత్తతో నెంతప్రేమతో జూచు చుండెదమో యటులనే యితరులయందును గాంచుచుండవలెను. కృషికుడు ఱాయి, ఱప్ప, మొదలగువానిని దీసి పాఱవైచి యనవసరముగా బ్రయత్నములేకయే మొలిచిన ప్రయోజనములేని చెట్టు  చేమలను బెరికివైచి చక్కగా నాగలిచే భూమినిదున్ని విత్తులుజల్లి వానకై మేఘావలోకనముజేయుచుం డును. అత్తఱి మేఘు డీదీనకృషికునియొక్క పాట్లనెఱిగి జాలినంది వర్షముగురిపించిన నాభూయజమానుడు సంతస మంది యుపకారియగు మేఘుని గీర్తించుచుండును గదా. అటులనే మనసహాయముగోరువారలకు సహాయము జేసితీరవలయును. మఱియు నితరులు మనలగోరక పూర్వమే బాధాపీడితుల కుపకార మొనరించుట సర్వొత్తమమైనది. దీనివలన నుపకార మందినవా రధికముగా హర్షమందుచుందురు. ఎటులన? ఎండవేళను మనమొక గ్రామమునకు