ఈ పుటను అచ్చుదిద్దలేదు
46

బా ల నీ తి.

పూర్వులలో గొందఱు సుజనులుకలరు. వారిలో నొకని జెప్పెద.

కుచేలుడనునొకబ్రాహ్మణు డుండెను. ఈతడు బాల్యమున గాశిలో సాందీపులవారివద్ద శ్రీబలరామకృష్ణులతోడ విద్యాభ్యాసమొనరించెను. తదుపరి గొప్పవిద్వాంసుడాయెను. ఆసాందీపులవారి సమీపమున జదివికొనినదినముల నీబలరామకృష్ణకుచేలు రన్యోన్యమిత్త్రత్వముతో నుండిరి. అంతట వారివారి గృహములకుజనిరి. ఈకుచేలుడు మిక్కిలి పేదయైనను ధనాశచే యాచనకైతిరిగెడివాడు కాడు. భగద్భక్తుడు. తనకున్నదానితో సంతొషమందెడి వాడు. సగ్గుణంకులుకలవాడు. ఈతడొకసతీమణిని వివాహమాడెను. ఆమెవలన గ్రమముగా సంతాన మెక్కువగా గనెను. కాని యాకుచేలు డీసంసారమునం దంతప్రీతిగానుండెడివాడుకాదు. అందువలన నింటి సమాచారముల విచారించకుండ నుండెడివాడు. అట్లు తన పెనిమిటి యుందుటజూచి యాపిల్లలనూఱడించుచు దానన్నముజాలించుకొని యైనను నాబిడ్డలకు బెట్టుచుండెడిది. ఇటుల గొలది కాలమైనతరువాత నాపిల్లలు తమతల్లిని మంచిమంచి దుస్త్గులను, రుచ్యములగునాహారపదార్దములను దెచ్చియిమ్మని పలుతెఱగుల బాధింపజొచ్చిరి. అంతట నామె తనపిల్లలపోటుబడజాలక తపమును జేసికొను భర్తసమీపమునకరిగి యిటుల బలికెను. "నాధా! మీరాతపమునుజేసికొనుచు నింటిచిగిలి నంటించుకొనక పోతిరి.