ఈ పుటను అచ్చుదిద్దలేదు

45

బా ల నీ తి.

కర్మముల నెక్కువగాజేయుచుండిన నాసమయమునం దీసజ్జనమిత్రుడు వారిదరిజేరి వారిమనమునకు బలు తెఱగుల బోధజేసి యాపాపపుబనులనుండి విముఖులనుగా జేయుచుండును. పుణ్యకార్యముల జేయ బ్రోత్సాహమొనరించుచుండును. వారిక్షేమము నకై యనేకవిధముల నాలోచించు చుండును. తపులనుదాచి యొప్పులను బ్రకటించుచుండును. వారెక్కువగా నుత్తలపాట్లుపొందుచున్నప్పుడీ సన్మిత్రుడు తన మిత్రులతోవచ్చి తనకుజేతనై నంతసహాయముజేసి మిత్త్రులచే జేయించి వారిని సుఖభాగులుగా జేయుచుండును. తమ మిత్త్రులకెట్టి విపత్తులువచ్చినను వానికిభయపడి సహవాసము జాలించుకొనక సహాయముజేయువాడే సన్మిత్త్రుడు. సుజనమైత్రి మొదట గొలదిగానుండి క్రమముగా వృద్ది జెందును. సుజనులుతాము ధనవంతులైనను విద్యా వంతులైనను సుగుణములనేప్రదానములుగా జేసికొని బీదవారలతోనైనను సహవాసమొనర్చ గలరు. వీరుసహవాసమొనరించినపిదప క్షీరనీరన్యాయముగా గలిసియుందురు. సుజనులు తమమిత్రులు మొదట నుచ్చదశలోనుండి దైవవశ మున నైచ్యపుదశకు వచ్చినను దానిని సరకుసేయక వారిని గౌరచించుచుందురు. కాబట్టియె "చెడి స్నేహితునింటికి బొమ్మను లోకోక్తి నేడు పుట్టినదికాదు.

ఇటుల దమమిత్త్రులు తక్కువవారై తలపక వారి సుగుణములనే ముఖ్యముగాజేకొని గౌరవించినవారు