ఈ పుటను అచ్చుదిద్దలేదు

21

బా ల నీ తి.

జీకర్ణునే నమ్ముకొనియుండెను., ఇటులుండ గలహమునాపి పాండవులకు వీరికి సంధిజేయుటకై శ్రీకృష్ణమూర్తి దౌత్యమువహించి వచ్చి ధృతరాష్ట్రాదులతో సంభాషించెను. కానియాయనవచ్చినదానికి వీరువిముఖముగా మాటలాడమొదలిడిరి. అంత దీనిని గృష్ణుడుకాంచి సంధికుదరకఫోయెగదా యని డెందమున విచారించుచు మరలువిషయమున గర్ణుని మాత్రముబిలిచి రహస్యముగా నిటులుబలికెను. "కర్ణా నీవు గురువరాదులందెక్కువ భక్తికలవాడవు ధర్మజ్ఞడవు. కాన నామాట వినుము. గొంత కన్యాత్వమున నదీసమీపమున దుర్వాసదత్తమంత్ర బరీక్షార్ధమై భాస్కరునిగోరి యాతనియనుగ్రహమున నిన్నుగనినది. కాబట్టి పాండురాజాగ్రసూతివైన నిన్ను ప్రాజ్యంబదు రాజ్యంబునకు నాయకునిగా జేయగలరు. నీకు బురవీధుల నుత్సవంంబొనర్తురు. నీకుధర్మరాజు యువరాజై నీప్రక్కననుండి ధవళచామరంబుల విసరగలడు. భీముడు తెలనిగొడుగును బట్టగలడు. అర్జునుడు సారధ్యంబుచేయగలడు. పాంచాలాది సేనా సమన్వితంలుగా నకుల సహదేవులు నిన్ను గొలువగలదు. మఱియు ద్రిలోకసుందరియగు ద్రౌపది కూడ నిన్నువరించగలదు. కాన బాండవుల గలసి పై లాబములంబొందు" మని బోధజేసెను. అంతట రాజభక్తిరతుడగుకర్ణుడు డాకృష్ణుడు సల్పినష్తతికిని, వచించిన లాభములకు నుబ్బక యిట్లుత్తరమొసంగెను. " స్వామీ! మీరు