ఈ పుటను అచ్చుదిద్దలేదు

19

బాలనీతి.

వృద్దిజెంది పంటపండినతరువాత నింటిధాన్యమున తెచ్చుకొందమనియాసచేనుండ నింతలో నాబూమిని జోరులు సొచ్చిభయమువిడనాడి యాధాన్యమును హరించుచుండగా వారికనులకు మనమగుపదితిమేని మనలదన్ని యెధేచ్చముగా నాపంటానుగొసి తీసికొని పోవుదురు. ఇటువంటి యన్యాయము సంభవించున దేనమయమువలదు? రాజులేనిసమయమునందుగదా కాబట్టి రాజులయొక్క సహాయము ముఖ్యముగా గావలయును. ఇంతయేల? ఆరాజసహాయ్యమువల ననే మనముబ్రతుకుచున్నామని చెప్పనొప్పు.

    రాజు, విద్యలునాశనమగుచున్నటుల గానుపించిన తక్షణమే యవి యబివృద్దికి వచ్చుమార్గము లాలోచించి యబివృద్దికిదీసికొనివచ్చును. జనుల సుఖదుఖముల నారయుచుండును. "వర్ణాశ్రమాచారధర్మంబుల నడుపు " డని బోదించును. బీదలను, సాదలను బోషించుచుండును. దిక్కులేనివారి కెల్ల దిక్కై పోషణ జేయుచుండును. "దుర్బలస్యబలంరాజా" యన వినవే? ప్రజలను రక్షించుచుటవలనను, శిక్షించి సన్మార్గమును జొన్పుటవలనను, దనకొమరులవలె భరించుటవలనను బ్రసిద్దిజెందిన రాజులే రాజులు. తక్కినరాజులు తరాజులని వచింపవచ్చును.
   మున్ను శ్రీరాముడు బాల్యముననే విశ్వామిత్రాజ్ఞాను సారముగా జెడ్డవారలగు తాటకామారీచుల దర్పమడాగించెను, యౌవనమున గారణాంతరమున బితాజ్ఞాపరిపాలన నిమి