ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

బా ల నీ తి.

చున్నా" డని యిదివఱకుండుకోపమును రెండురెట్లధిక ము జేసికొనియు జేయునదేమియులేక విసివి యాబాలుని జీరి "కొడుకా! నీవప్పుడు కనులకు గబపడనివానిని గొనియాడుచుందువు. వాడెక్కడునున్నా"డని యడిగెను. అంతనాబక్తశిరోమణి "సర్వశక్తిసంపన్నుడగు నాదానవవైరి ప్రతిపదార్దము నందునుగల"డని పలికెను. అంత నాహిరణ్యకశిపు "డటులైన నాచక్రిని గిక్రిని నీకంబమునందుజూపుము లేదా నీశిరంబిప్పుడే భూతబలి జేసెద" నని వ్రాక్కుచ్చెను. అంతట భాగవతశిఖామణియగు బ్రహ్లాదుడాపరమాత్మను నిశ్చలభక్తితో ధ్యానింప నా పరమేశ్వరుడు తనభక్తుని కోరికదీర్చుటకై తనశరీరము యొక్కక్రిందిసగమున మనుజాకారమును, బైసగమున సింహాకారమును, దాల్చి "నృసింహమూర్తి" యను పేరున గంబమునుండి బయలువెడలి జగదేకవీరుడై తనభక్తుని బలుతెఱంగుల బాములబెట్టినవాడును, లోకకంటకుడునగు నాహిరణ్యకశిపుని సంహరించి దేవాదులచే సన్నుతిగొని భక్తునిగాపాడి యంతర్దాన మయ్యెను.

చూచితిరా! ఆప్రహ్లాదుడు భక్తివలనగాదె తనజన కుడు పెట్టినబాధల బొందకపోవుటయు కాక దుర్లభంబగు పరమాత్ముని దివ్యరూపము గాంచగలి గెను. కాబట్టియెప్పటిఆప్రహ్లాదుడు డవిచ్చిన్నమగు కీర్తినిబడయుచున్నాడుకదా! కాన మనమందఱము భగవద్భక్తి కలిగియుండుట