ఈ పుటను అచ్చుదిద్దలేదు
154

బా ల నీ తి.

యాంధ్రీకరనము. "మక్కికిమక్కి" గాలేదు. కాని చక్కగా సంస్కృతభారతానుసారముగానున్నది. మనకీ మువ్వురెయాంధ్రబాషయందు బ్రబలప్రామాణికులు. వీరి ప్రయోగములె మనకు శరణ్యములు. మన తెలుగు బాసలోనికి భారతము మొదటి పొత్తము. ఈ బారతము లో సమానమగుగ్రంధమింతవఱకు బుట్టలేదు. సద్గుణ నికరోపేతంబగు నీకవిత్రయంబును, సులక్షణలక్షితంబు గు నీభరతంబును, నటులుంచి యీయాంధ్రభాష యందున నుండుముఖ్యకవులను గైకొని యింకను దెలుగును గుఱించి తెలిసి కొందము.

    ఈపదునాలుగవ శతాబ్దమందె హుళక్కిభాస్కర మహాకవియుండెను. అతడు వాల్మీకికృతరామాయణ మును దెనిగించెను. ఈతడిరామాయణమందున నారణ్యకాండమును యుద్ధకాండలో గొంతభాగమును, మాత్రమురచించెను. తక్కినభాగములో బాల,కిష్కిందా, సుందరకాండములను దత్పుత్త్రుడగు మల్లికార్జునబట్టును, అయొద్యాకాండములోని తుది భాగమును నతనిమిత్త్రుడగు నయ్యలార్యుడును వ్రాసిరి. ఈమువ్వురు, తామురచించినను మొదట బ్రారంబించి కొంతవఱకు జేసిన యాహుళక్కి భాస్కరునె గ్రంధకర్తగానేర్పాటుజేసిరి. కాబట్టియె దానికి బాస్కరరామాయణమని పేరువచ్చినది. ఈతని కవిత్వమతి పటువై యానందము నింపుచుండును.