ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

బా ల నీ తి.

లేనిపూజ పత్రిచేటను సామెతవినలేదా? కాబట్టి మనము చేయుపూజను నిశ్చలభక్తితో జేయవలెను.

అంతట దుష్టులను శిక్షించువాడును, శిష్టులను రక్షించువాడును నగు నాపరమేశ్వరుడు మనమొఱ తెఱగునెఱంగి మనముసేయుసేవకుమెచ్చి మనమనో బీష్టముల నెఱవేఱ్చి మనసుఖదు:ఖముల నారసి యొగ్గులున్న దగ్గించి లగ్గులున్న నెక్కువజేసి మనకు దోడునీడై సదా తిరుగుచు గాపాడుచుండును. మనము భగవద్భక్తికలిగియున్నయెడల మనపగతుఱు మనల జిక్కుల బెట్టదలచిన నవి యెంతమాత్రమును మనలను బాధింప జాలవు.

ఈభక్తివిషయమున బ్రసిద్దినెక్కినవారలు పూర్వుల లో జాలమంది కలదు. వారిలో నొకొరిని జెప్పెదను.

హిరణ్యకశిపునకు గుమారుడగు ప్రహ్లాదుడు, తన తండ్రికి మిక్కిలిశత్రువును, భగవదవతారము నగు విష్ణునందు భక్తికలవాడై యుండెను. ఇట్లుండుట యతనితండ్రిచూచి వింతనంది తనకొమరున కనేక విధంబుల "నాతనియందు భక్తిమాను" మని చాలసారులు చెప్పెను. కాని యాపిల్లవాడు వినకపోయెను. అంతట దండ్రితనకొడుకుని విధ వివిధ హింసల బెట్టెను. ఇతరులచే బెట్టించెను. కాని యాప్రహ్లాదుడు మాత్రమించుకయైన భాధను బొందలేదు. అత్తఱి నాప్రహ్లాదుతండ్రి "ఏమిదిచొద్యమా ఎన్నివిధముల వేధించినను నీతనయ డాబాధలుబొందక యన్మద్వైరిని ఎక్కువగాస్తుతించు