ఈ పుటను అచ్చుదిద్దలేదు

143

బా ల నీ తి.

        సూత్రకారుడగు పాణినిమహర్షియు, వాతిన్ కారుడగు వరరుచియు, భాష్యకారుడగు పతంజలియు వీరుముగ్గురుచేరి లక్షణగ్రంధమొకదానిని రచించి సంస్కృతమును నియమబద్ధముగా నొనరించిరి. ఈ ముగ్గురుజేరి లక్షణగ్రంధమేర్పఱచిరికాన వీరికిముని త్రయమని పేరువచ్చినది. అన్నిబాషలకు మూలమగు నీయాదిభాషకు సరసముగా వ్యాకరణంబొనర్చిన నీమహనీయులయొక్క పాండితీవైదగ్ద్యమెంతగొనియా డినను దక్కువయెకదా.
      మఱియు గాత్యాయనుడను నొకమహర్షికూడ గొన్నిసూత్రముల రచించిభాషకుపకార మొనరించి వాసిగాంచెను.
     
     మహాశయులగు నీనలువుర సూత్రభాష్యముల ననుసరించిపండితప్రకాండులు కొందఱు వృత్తులను రచించిరి. ఈవృత్తులకు మఱికొందఱు సుధీవరులు వ్యాఖ్యానముల మొనరించిరి. మహర్షికృతసూత్ర వాతిన్ కభాష్యములకు వృత్తులరచించిన వారియందు ను, వృత్తులకు వ్యాఖ్యానముల నొనరించినవారియం దును భట్టోజిదీక్షితుడు క్దుప్రసిద్ధుడైయున్నవాడు. ఈయన పాండిత్యాతిశయ మనిర్వచనీయము. ఈతనిగ్రంధబోధకతాశక్తి నురుపమానము. ఈ మహానుభావుని నామునిత్రయముతొ సమానునిగా లెక్కింపవచ్చును. ఈతడు రచించినసిద్ధాంతకౌముది యనునది సుబోధకమై నుతిపాత్రమగుచుండును. 
    అద్వైతమతావలంబుడును, సారస్వత బ్రాహ్మణు డునగు శ్రీకాళిదాసు క్రీస్తుపుట్టుటకు బూర్వము 56వ సం