ఈ పుటను అచ్చుదిద్దలేదు
142

బా ల నీ తి.

      వీరితరువాతబరాశర పుత్త్రుడగు వ్యాసుండష్టాదశ పురాణములను, సకలధర్మాదర్శంబును బంచమవేదంబును నగు భారతంబును రచియించి నిలింపభాషయందున రెండవకవియని ప్రఖ్యాతిగొనెను. ఈపురాణము లందనేక చరిత్రలభిజ్ఞలకు మనోజ్ఞములై యొప్పుచుండును. వీనియందు ధర్మములు వివరముగా జెప్పబడును. కాననివియును హిందువులకు గౌరవార్హములు.
   ఇంతవఱకు లక్షణగ్రంధములు లేకపోయినను బైవారాది కవియ్లగువాల్మీకి మహర్షీననుసరించి వ్రాసిరి. క్రీస్తుపుట్టుటకుబూర్వము 12వ శతబ్దమందున్నపాణిని మహర్షియీశ్వరానుగ్రహమున బదునాలుగు సూత్రములబొంది వానికి దానునాలుగువేల సూత్రముల నైపుణిగారచించి "యష్టాధ్యాయా యను పేర నొకగ్రంధమును బ్రకటించెను.
     తదుపరి వరరుచియను మహానుభావు డాపాణిని మహర్షిచేసిన నాలుగువేల సూత్రము లీసంస్కృతభాషను సంస్కరింపజాలకపోవుటగాంచి తానునాతిన్ కములను గొన్నిరచించి భాషోద్ధారకుండై లొకబూషితుడాయెను.
       ఇతని తరువాత క్రీస్తుశకమునకు బూర్వము 2వ శతాబ్దమందున్న పతంజలియను మహాముని యాపాణిని మహర్షి రచించిన నాలుగువేలసూత్రము లను, గైకొని వానికి భాష్యమొనరించిలోకకృతజ్ఞతా పాత్రుడయ్యెను.