ఈ పుటను అచ్చుదిద్దలేదు
140

బా ల నీ తి.

      ఈజగమునందు భాషలకన్నిటికి నిదియేమూలము. అనగానేభాధయైనను దీనిననుసరించియెయుండును ఈయాదిభాష, ప్రాకృతము, సంస్కృతమనునామధేయముతో రెండువిధములై యొప్పారు చుండును.
  ప్రాకృతమున సరస్వతీదేవి బల్యమునదొట్రుపాటుగ మాటలాడినది. ఇదియాఱువిధములైయుండును. దీనిని నాటకాలయందునీచపాత్రాదులకు

యోగించుచుందురు. ఈప్రాకృతమునకు దగినవ్యకరణశాస్త్రమును వాల్మీకి ంహర్షి రచించెను.

   ఇక సంస్కృతమున సలక్షణముగా లక్షణగ్రంధములచే సంస్కరింప బడినదని యిదివఱకె చెప్పితినిగదా. ఇది సర్వజనులకుపయోగించును. ప్రాకృతమంతగా నుపయోగములో లేదు. కాన దానినివిడిచి యుపయో మెక్కువగాగలిగిన సంస్కృతవిషయమై మహర్షీతరులగు ప్రకృతము ప్రసిద్ధిని బొందియున్నగ్రంధనిర్మాతలను గొందఱినిమాత్రము గైకొని సంగ్రహముగా దెలిసికొందము.
   మన మత నీతి జ్ఞానచారిత్రముల కాటపట్టగు వేదములపౌరుషేయములై సుస్వరయుక్తములై యీసంస్కృతభాషయందే ప్రకాశమానము లగుచున్నవి. ఈవేదములు శ్లోకరూపములుగా నుండవు. ఇవిహిందువులకు బ్రబలప్రమాణములును, బూజ్యములు నగుచున్నవి.