ఈ పుటను అచ్చుదిద్దలేదు
138

బా ల నీ తి.

    ఆరోగ్యముతో సమానమైన భాగ్యమింకొకటిలేదు. మనమారోగ్యముగానుండుటకు గొన్నిమార్గములిదివఱ కె చెప్పబడియున్నవి. వానినన్నిటిని మనమాచరించు చుండవలయు. "రానున్నది రాకమానదు. కానున్నది కాకమాన"దని యారోగ్యవిషయమున విచారించగూడదు. అనేకభంగులనారొగ్యముగానుండ వలెను. ఆరోగ్యమార్గములకు మనము వ్యతిరేకముగా నడచితిమేని దప్పక హానిబొందగలము.
     అట్లారొగ్యమార్గములకు భిన్నముగానడచి  కీడు బొందినవారలలో నొకనిని జూపించుచున్నాను.
     మున్నువిచిత్రవీర్యుడనువాడు శంతన మహారాజు నకు రెండవకుమారుడైనెగడుచుండెడివాడు. ఇతడు తనయన్నయగు బీష్మాచార్యులసహాయమున గాశీరాజ హితులగు నంబికాంబాలికలను నిరువురుపూబోడు లను వివాహమాడెను. ఆనెలతలయందు మిక్కిలి మక్కువగా నుండెడివాడు. ఈ లాలసలిద్దరుతనతొడగాపురముజేయ మొదలిడిన తోడనె యఖండంబగు రాజ్యంబునందలి విశేషంబుల విచారించుట మానివైచెను. జనులనసుఖదు:ఖముల గాంచకుండెను. వేయేల? సర్వవ్యాపారముల విడనాడి యెల్లప్పుడు సుందరాంగులతో నిండుకొని యుండెడి మంచితోటలయందును విహరించుచుడెడి వాడు. ఈవిధముగా నితరవ్యాపారములవిడనాడి యా