ఈ పుటను అచ్చుదిద్దలేదు
130

బా ల నీ తి.

లచినపిమ్మటగదా వాడాచోరత్వమును జేయమొదలిడును. ఇటుదొంగతనము జేయువానికంగీకారమైనటుల నితరులకు గూడ సమ్మతముకాగలదా? కాదు. అటులనె చెడుపనులజేయువారికి జెడుపనులందిష్టముండును. కాని సన్మార్గులకిష్టముండునా? ఉండదు. ఎవరైననుదాముచేయుపని చెడ్డదైనను మంచిదని తలచినగాని యాపనిని సాధించబ్రారంభించరు. కాన లోకమున బ్రతివాడును తానుమంచివాడని తలచుట స్వాభావికముగా గ్రహియుఒంపదగియున్నది. అటులైనమనమిక సత్ప్రవర్తకులను, దుష్ప్రవర్తకులని దెలిసికొని వారిని దగునటుల గౌరవించుటను గుర్తెఱుగవలసియున్నది

    దుర్జనులు, వారిగుణములను శీర్షకక్రిందదుష్ప్రవర్తకులవిషయము జక్కగాదెలియబరచియుంటిని. కాననికసత్ప్రవర్తకులెటువంటివారలో గనుగొందము.
  ఈసత్ప్రవర్తనకు లితరులయందు గారుణ్యము వహించితమకుజేతనైనంత వఱకు మేలుల గూర్చుచుందురు. వీరలోకరిపై నిష్కారణముగా శత్త్రుత్వమును బూనరు. సత్కార్యములకంతరాయములను వీరు గలిగించరు. వీరుపక్షపాతానూయాభావములతో నుండరు. వీరు శాంతమునుదాల్చి యుందురు. వీరలు తమకున్నకలిమితో యోగ్యులకు దానముజేయుచుందురు. వీరలు తమవణన్ మునకు దగునధర్మములనె యాచరించుచుండెదరు. వీరలనృతమాడుట కుంకించరు. జారత్వచోరత్వద్వసత్కార్యముల యందుబ్రవేశించిరు. వీరలుసజ్జనుల