ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీశారదాంబాయైనమ:

బా ల నీ తి


భగవద్భక్తి.

భగద్భక్తియన భగవంతునిసేవించుట, లేక, యాతని నమ్మియుండుటయే. భగవంతుడన శ్రీ వీర్యము, ఇచ్చ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, యను నీమహాసుగుణములతో గూడికొనినవాడు. అతనిని నమ్మియుండుటయే భగవద్భక్తియనబడు.

ఈభగవద్భక్తిగలిగినవారలు భాగవతులనదగుదురు. వీరికిగ్రమముగా నాశనములేనిపదవి లభింపగలదు. ముముక్షులకు భక్తిమార్గము మొదటిసాధనము. ఈభాగవతులకు సర్వకార్యములుసిద్ధియగుచుండును. కీడులుమూడవు, మేలుబొనగును. సద్భుద్ధిసంభవించును. దుర్భుద్ది యడుగంటును. మనము నిశ్చలమగుచుండును. మమమెందుల కాభగవంతునియందు భక్తికలవారముగానుండవలెనన? ఆదయామయుడు సర్వభూతములందును దయగలవాడై వానికిదగినటుల నాహారాదులనొసంగి సర్వకాలములందును వానిని బాధలబొందకుండ జేయుటవలనను, మనకుగష్టములు సంభవించిన సమయంబునం దామహామహుని ధ్యానించించినయెడల దత్కా