ఈ పుటను అచ్చుదిద్దలేదు

115

బా ల నీ తి.

    ఈవిషయమున బూర్వులలోనుండి యొకనిని జూపెద.
    తొల్లిసకలాలంకారాలంకృతంబగు సకలయనుపురం  బున కధినాయకుడైన కుబేరు డాదిని మంచి మార్గమున దనమును సంపాదించెను. అటుతరువాత దానెక్కువగా గర్వించకపోయినను నాధనమునానాటికి వృద్ధిచెందుచుండును. క్రమక్రమముగా నవనిధులు చేరెను. నవనిధినాధుడైన యీకుబేరుడు వివేకియై యెటుల ధనముదేనికి నుపయోగింపవలయునో యాసంగతి దెలిసికొనుచు బాగుగా నుపయొగించు చుండెను. యితడీ ధనమువలన యక్షులను, గిన్నరులను, గుహ్యకులను, మొదలగుబీదవారిని గాపాడుచుండెడివాడు.  ఈధనమువలనే యుత్తరదిశకు దానధిపతియయ్యెను. దీనివలననే రాజరాజని పేరు గాంచెను. ఇతడు ధనమెక్కువగా దానముజేయుచు న్నందువలననె ధనవంతుడనియు వాసిగాంచెను. మఱియు నితడీధనమువలనె మహానుభావుడగు పరమేశ్వరుని తోడ స్నేహమొనరించెను.
    
      చూచితిరికదా. ఆకుబేరుడీధనంవలన బొందిన లాభములన్నియు, కాన "ధనమూలమిధమజగ" త్తనుమాటను జ్ఞాపకముంచుకొని యత్యాశవిడనాడి మంచిమార్గమున ధనమార్జించి గర్వించక దానిని దుష్కార్యములకు వినియోగించక మంచిపనుల కుపయొగించుచు గీర్తినిగాంచుచుందము.