ఈ పుటను అచ్చుదిద్దలేదు

101

బా ల నీ తి.

కుండని బ్రహ్మమహేశ్వరుల బ్రార్దించి మంటలనార్పుడని కోరెను. దానికి వారు మావలనగాదనిరి.అంతట విష్ణుమూర్తినిగూడ సందర్శించి యతనినిగూడ బైవిధమున గోరనతడుగూడ మావలనగాదు. కాని నాభక్తకుడగు నంబరీషుని వలన నీమంటలు చలార గలవని చెప్పెను. అందుల కామహర్షి ఖిన్నుడై యిదివఱకు మంచివానిని బాధించుటవలనగదా మగుడ బాధలబొందుచుంటినని పశ్రాత్తాపము జెందుచు చివరికాయంబరీషుని సమీపమునకెవచ్చి యీమంటలనార్పి నాబాధదొలగింపుమనిం ప్రార్దించెను. అంత నారాజు విష్ణుమూర్తియనుగ్రహమున నతనిభాధ దొలగింప జేసెను. తదుపరి వరిద్దరుకలసి యన్నమును భుజించిరి.

    చూచితిరా? ఆదుర్వాసు డారాజును గోపముచే హింసింప మొదలిడెను. దానికి  బ్రతిఫలముగా నామహర్షి యెంటకష్టపడెనో తెలిసినదికదా. కాబట్టి యెవరైనను గోపమువిడనాడినవారు సుఖింపగలరు. కాన మనము కోపమువీడి శాంతముగలిగి సౌఖ్యముల బొందుచుందము.

ఆ. కోపమునను ఘనత♦కొంచెమైపోవును
    కోపమునను మిగుల♦గోడు జెందు
    గోప మడచెనేని♦గోరిక లీడేరు
    విశ్వదాబిరామ!♦వినురవేమ!.