ఈ పుటను అచ్చుదిద్దలేదు
100

బా ల నీ తి.

యపూర్వకముగా గోరెను. దాని కామహర్షి యంగీకరించి "ఇదుగొ వచ్చెద" నని స్నానార్దమై యమునానదికింజనెను. అంత నారాజు తనమనమున "నీమర్షి యిదిగోవచ్చెదనని చనెను. ఇంకను రాకపోయెను. కాలమా యతిక్రమించుచుండెను. వ్రతమా భంగమగుటకు సిద్ధముగానుండె. ఏమిచేతు" నని జిజ్ఞాసబడుచు బండితమతరీతిగావ్రతభంగము కాకుండుట కుదకముమాత్రము పుచ్చుకొని స్వాతి వానకు ముత్యపుచిప్పవలెదురుచూచి నట్లామర్షికై యెదురు చూచుచుండెను. అంతనాదుర్వాసమహర్షి వచ్చి యారాజు సలిలము ద్రాగినసంగతి దెలిసికొని కోపముతో "రాజ! నన్నువిందునకు బిలుచుట యెందుకు? అభ్య్హాగతినగునాకంటే ముందుగా నీవు భుజించియుంటకేనా?" యని పలుకుచు దననెత్తిని నుండు నొకజటను బెరికి "ఈయమంబరీషుని గాల్చివేయుగాక" యని యాతనిపై విసిరివేసెను. అంత నాజట భగ్గుభగ్గున మండుచు నాయమంబ రీషుని సమీపించెను. అంత నారాజు విష్ణుమూర్తిని ధ్యానింప నాభక్తవత్సలుడీభక్తరక్షణార్దమై చక్రము నంపెను. అంతనాచక్రముమామర్షిప్రయొగించిన జటయొక్క మంటలనారిపి తిరిగి తానుభగ్గుభగ్గున మండుచు నాయంబరీషుని బాదించువాడును, ముంగోపియు నగుదుర్వాసుని జుట్టుముట్టెను. అంత నాదుర్వాసుడా మంటలకు దాళలేక గుహలను సముద్రములను జొచ్చెను. అతని వెంబడి నీచక్రమును జొచ్చెను.తుదకామహర్షి సత్యలోక కైలాసముల