ఈ పుటను అచ్చుదిద్దలేదు

99

బా ల నీ తి.

కుండునా? మిన్నకుండడు. చక్కనిపాలు పొంగువచ్చు సమయమున గొంచెము నీరుజల్లిన నాపాలు పొంగు మానియుండును. ఆనీరునె క్రాగుచున్ననూనెలో జల్లిన యెడల నానూనె మరింత భగ్గునమండి యిల్లుగాల్పక యుండునా? ఉండదు. కాబట్టి సజ్జనుడు కోపియైనను పెద్దలమాటవిని కినుకమానుననియు, దుర్జనుడు వినక యింక నెక్కువదౌర్మార్గ్యమును జూపుననియు దెలిసికొనవలయును. ఈముంగొపులౌ తారాతామ్య భావములు గమనించరు. కాని తమకంటె నెక్కువ బలముగలవారిపైగాని తమయదికారిపైగాని కినుక సాధ్యమైనంతవఱకు జెందరు. కినుక వారిపైగలిగియు న్నను నేమియు బ్రయోజనములేదని యాముంగొపు లకు దెలియును. కోపముగలిగినవారలు కష్టముల జెందినతరువాత బశ్చాత్తాపమందుదురు.

   అటుల గినుకచే గష్టములబడి పశ్చాత్తాపము జెందినవారు పూర్వులలో గొందఱు కలరు. వారిలో నొకని జెప్పద.
    మున్ను దుర్వాసమహర్షి విష్ణుబక్త శిఖామణి యగు నంబరీషునిసదనమునకు జనెను. అత్తఱి నాతడు ద్వాదశిపారణజేయ నుద్యమించుచుండెను. కాని యీమహర్షి తనకడకువచ్చిన సంగతిని విని యచటనుండి లేచి ప్రత్యుద్ధాన పూర్వకంబుగ నా మహర్షిని దోడ్కొనివచ్చి యుచితాసనంంబిడి సిరుంబారని నాయింటికిపుడ నిందునకురమ్మని విన