ఈ పుటను అచ్చుదిద్దలేదు
96

బా ల నీ తి.

జమదగ్ని వలదనిచెప్పుచున్నను వినక యాహోమధేనువును దోలుకొనిపోయిరి. అంత నారాజు కూడ దనపురమునకు జనెను. అటుతరువాత నా జమదగ్నికుమారుడదు పరశురామెడీసంగతి యంతయువిని యాగ్రహముతో నారాజుసదనమును జేరెను. అంత నారాజు తనకడకువచ్చిన పిల్లడగు నీ పరశురసమునిజూచి వీడు బ్రాహ్మణవిధంబున నుండుట మాని భండనమునకువచ్చియున్నవాడు. కాన వీనిని నిర్జించవలసినదే యని గర్వముతో నా పిల్లనితో యుద్ధమొనరింపసాగెను. తుదకా పరశురాముడా కార్తవీర్యార్జునిని యమపురికంపివేసి, తనహోమధేనువును దీసికొనివచ్చి తండ్రికి సమర్పించెను.

      కంటిరా! ఆకార్తవీర్యార్జునుడు గర్వముచేత నన్యాయమునకు దిగెనుగదా. దానివలన నతడు యమపురి జేరవలసివచ్చెను. అతడేయననేల? నేనిప్పు డుదాహరించిన యితిహాసము వలన రావణుడు పరాభూతుడగుటయు గార్తవీర్యార్జునుడు మడియుటయు గూడ నిందులకు దాహరణములే! తుదకు బరసురాముడుగూడ శ్రీరామునిపట్టున నిందులకే యుదాహరణముగా నిలిచెను. దీనివలన మనము దెలిసికొనవలసినదేమి? గరువమనునది యెంతటివారికిని బరిహరింపరానిది. కావున దానిపట్ల మనము కడుజాగరూకతులమై మెలగవలెను. గరువమన్నను నహంకారమన్నను నొకటే! ఈ యహంకార మాపత్కరము. ఈయహంకారమును  విధ్యార్దు