ఈ పుటను అచ్చుదిద్దలేదు

93

బా ల నీ తి.

   ఈయహంకారము, ధనాహంకారము, కులాహంకారము, విద్యాహంకారము, రూపాహంకార, మనుపేరులతో నాలుగువిధములుగా నుండును. 
    అందున మొదటిది ధనాహంకారము, అనగా డబ్బువలనవచ్చినగరువము. ఇది, దరిద్రులమీదికి నొంటికాలిపై లేచును. భృత్యులను వేధించుచుండును. ముఖస్తుతుల గోరుచుండును. క్రోధమునకు బ్రోత్సాహము జేయుచుండును. యుక్తాయుక్త విచారణ సన్నగిల జేయును. అధర్మములకు ముందంజవేయును.
    రెండవది కులాహంకారము. అనగా మంచికొలము నందు బుట్టినందువలన వచ్చినగరువము. ఇది తక్కువ జాతులపై హుటాహుటి జనుచుండును. తనకంటె దక్కువజాతిలోనుండువాడు విద్వాంసుడైనను వానిని దృణీకరించు చుండును. 
    మూడవది విద్యాహంకారము. అనగా జదువు వలన వచ్చినగరువము. ఇది, విద్యావిహీనుల మనుజులుగా బరిగణించదు. కించిజ్ఞలను నీచులనుగా లెక్కించుచుందురు. సరివారలను నెక్కిరించును. ఎక్కువవారలకు గపటవినయమును జూపుచు వారిని నిర్లక్ష్యముగా జూచుచుందురు. తనతో  సమానమైనదింకొకటిలేదని తలచును.
   నాలుగవరి రూపాహంకారము. అనగా సొగసైన యాకారమువలన గలిగినగరువము. ఇది, యబలలపై దడా