పుట:Baarishhtaru paarvatiisham.pdf/99

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వీపము. రాక్షస కులమంతా రామరావణ యుద్ధములో అంతరించింది. కనుక ప్రస్తుత మిక్కడ రాక్షసభయ మేమీ లేదు.

నేనింతకాలమునుంచీ మనదేశ దుస్థితి చూస్తూంటే నాకు చాలా విచారంగావుంది. చూస్తూ సహించి ఊరుకోలేక పోయినాను. ఈ దేశ దుస్థితి తొలిగించడము ఏలాగాఅని చాలాదూరము ఆలోచించాను. నాకు తోచిందేమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ల గుట్టూ మట్టూ కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందనీ, అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావలెనని బయలుదేరాను. వెళ్ళేవాళ్ళము ఏలాగూ వెళ్ళుతున్నాముకదా! ఇదంతా ఒకటి రెండు పూటల్లో అయ్యేపనికాదాయెను. కొంతకాలము అనగా ఒక యేడాది రెండేండ్లో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిష్టరు పరీక్ష చదివి ప్యాసు అయితే మళ్ళీ స్వదేశానికి వచ్చిన తరువాత ఒకడికింద తలవంచుకొని పని చెయ్యనక్కర లేకుండా స్వతంత్రముగా జీవనము చేయవచ్చునని ఊహించి అక్కడ బారిష్టరు చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యేఖర్చు విషయము ఎంత కావలసిందీ అక్కడికి వెళ్ళిన తరువాత వుత్తరము వ్రాస్తాను.

ప్రస్తుతము ఖర్చుకోసం అయిదువందల రూపాయలు ఇక్కడ నర్సాపురము నాటకము కంపెనీలో రాజువేషము వేసే గజవిల్లి నారాయణగారిద్వారా రు 1-14-0 లు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నాయందుండే స్నేహభావము చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించా ననీ, సొమ్ము మట్టుకు త్వరగా పంపించ మనీ చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలూ వారికి వెంటనే ఇచ్చివేసి మరో అయిదువందలు ఫ్రాన్సు దేశములోవుండే