ఈ పుట ఆమోదించబడ్డది

అతిబాల్యవివాహము

33

లికల కామాత్రపు పుణయమయినను లేక క్రూరమయు చిరకాలాగ తమయిన యొకదురాచారప్రాబల్యముచేత నోరెఱుఁగని దశలో తల్లిదండ్రులువేడుకకొఱకువివాహమని పేరుపెట్టి యొకతంతునడసినదోషమునుబట్టి యావజ్జీవమును ప్రపంచసుఖములకు దూరురాం డ్రైమరణమునకంటెను తీవ్రవేదనాకరమయిన దుస్సహవైధవ్యవాధననుభవింప నిర్బంధింపఁబడుచున్నారు. అప్పటి జనపరిగణమును బట్టి యిట్టి దుస్స్థితిపాలయి యున్న పసిబాలికలు మనదేశమునందెందఱున్నారో యాలోచింపుఁడు. ఆ సంవత్సరమున తొమ్మిది యేండ్లకు లోఁబడిన వయస్సు గలవారయు భర్తలని చెప్పఁబడిన పురుషులను పోఁగొట్టుకున్న దురదృష్టతను వహించిన దయనీయ లయిన బాలిక లు౭౮౯౭౬గు రుండిరి. ధనము వ్యయము చేసి యా పసిబాలిక లకు వృధాగా తఱుగని దు:ఖమును గొని తెచ్చిపెట్టుకొనుటకుఁ గాక వీరి వివాహము వలన నెవరి కేవిధమయిన లాభము కలిగినది? ఈ చెప్పినవారుగాక యా సంవత్సరమున పదునాలుగు సంవత్సరముల ప్రాయమునకు లోపుగా నున్న ౨,౧౭,౩౮౮గురు బాలికలుకూడ విధవలయి యుండిరి. ఈ మూడులక్షల బాలికలును తలిదండ్రులచేతను సంరక్షకులచేతను బాల్యవివాహ మను పెనుభూతమునకు నిష్కారణ ముగా బలి పెట్టబడి కలకాలమును దు:ఖపరంపర పాలు చేయఁబడిన వారేకదా? మన దేశమునందలి వైధవ్యదు:ఖమున కంతకును బాల్య వివాహమే ప్రధానకారణము కాకపోయినను ఇన్ని లక్షలబాలికల వైధవ్యమున కయినను కారణమయినందుకు లేశమాత్రమును సందేహము లేదు. ఇఁక వైధవ్యమును పొందక తిన్నగా నున్నవారిగతి విచారింపుఁడు. వివాహమునాటికి చక్కగానున్న పురుషులుగాని స్త్రీలుగాని పలువురు స్ఫోటకము మొదలయినవ్యాధులచేత కన్నును కాలును చెడియు, వికలాంగు లయియు, దుర్బలశరీరు లయియు,