పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలహాబాదు-కోసముస్తంభము.

ఈ స్తంభమిప్పుడు అలహాబాదుకోటలోనున్నది. ఇది 42 అడు గుల 7 అంగుళముల ఎత్తుగనున్నది. దీని పైని (1)ఢిల్లీ తోప్రా స్తంభము మీఁది అశోకుని ఆఱు శాసనములుమ(2) రాణీ శాసనమును (3) కౌశాంబీ శాసనము నేగాక మహా రాజాధి రాజసముద్ర గుప్తుని శాసన మొకటియు, జహంగీర్ చక్రవర్తి శాసన మొకటియు, ఈశానస పంక్తుల మధ్య నుండి నాగ రాక్షరములలో వ్రాయఁబడిన మరియొక శాసనమును గలవు. ఈ స్తం భముమీఁది యశోకుని శాసనములను చదివినవాఁడు ప్రిన్సెపు పండి తుఁడు. రాణీ శాసనముకూడ ప్రిన్సెపు పండితుఁడె చదివినాఁడు. కౌశాంబీ శాసనమును కన్నింగుహాము పండితుఁడు మొట్టమొదటచదివినాఁడు.

ఈ స్తంభమును అశోక చక్రవర్తి మొట్టమొదట కౌశాంబీపురము నందు నిలిపియుండవలయును. ఈ పురము నేఁడు అలహాబాదునకు 28 మైళ్ళ దూరమున యమునానదికి యెడమయొడ్డుననున్న కోసము అను గ్రామమే. అచ్చటనుండి ఫిరోజు షహాయైనను, అక్బరుచక్రవర్తి యైనను దానిని అలహాబాదునకు తెప్పించి యుండును. సముద్రగుప్తుని శాసనము ఈ స్తంభము పై చెక్కఁబడునప్పటి కది కోసమం దెయుండియుండును. దీని పైనున్న జహాంగీరు వ్రాయించిన శాసనము కీ. శ. 1605 వ సం,, రం నాఁటిది. దీని పై నా చక్రవర్తి తసపూర్వుల పేళ్లను లిఖించెను.

(1) మొదటి ఆరు స్తంభ శాసనములు

మొదటి స్తంభ శాసనము; అలహాబాదు కోసము.

1 (1) దేవా వంపి యే పియదసి లాజా హేవం ఆహా (1) నడువీసతివ సాభిసి తేనమే ఇయం ధంమలిపి లిఖాపితా (2) హిదతపాల తే దుసంపటి పాదయే