ఈ పుట ఆమోదించబడ్డది
అభినందనము.
"ఆంధ్రప్రబోధినీగ్రంథనిలయము చిరస్థాయిగ విలసిల్లు గాక" యని ఆశీర్వచించుచుఁ దదభివృద్ధినే యాకాంక్షించుచు మాయుద్యమమున కెల్లవిధములఁ బోత్సాహముంగూర్చుచు దాము రచించిన “వైదర్భీపరిణయము” అనుగ్రంథరాజమును మాగ్రంథనిలయమున కొసంగిన మ. రా. రా. శ్రీ శ్రీ రాజాకమదన వేంకటరావు బహద్దరు జమీందారు వారికి మాకృతజ్ఞతాభినందనముల నర్పించుచున్నాము ఇట్టిస్వధర్మనిరతులకు సర్వేశ్వరుఁడు చిరాయురారోగ్యభోగభాగ్యములఁ గూర్పు గాక!
సంపాదకుఁడు