పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 15

కర -- లేదులేదు తమలపాకులు మీకు నేనుస్వయంగాతీసుకు రావలెనని వెంకడిని అక్కడకు పంపినాను. మిమ్మలినిచూడగానే చెయ్యివడుకెత్తి పళ్ళెంజారి పడిపోయింది.

మోహి -- (తనలో) ఈసమయంలో మావాళ్ళు యెవరయినావచ్చి చూచిపోతారేమో అని నాకుసిగ్గువేస్తూవున్నది.

కర -- (తనలో) నేను వీరినివిడిచి వక్కనిముషం అవతలకు వెళ్ళను, యేమిచేస్తారో చూతాము.

రామా -- ప్రియురాలా! తినవేమి?

మోహి -- మీరుచేసే ఆదరణచేతనూ గౌరవంచేతనూ నాకు ఆకలికనపడడం లేదు. (అని తినుచున్నది)

కర -- (తనలో) అది మిఠాయివుండలు యేలాగు మింగుతూ వున్నదో దాన్ని చూస్తే నానోరు వూటలువూరుతూవున్నది.

రామా -- కరటకా! ఆతమలపాకులు యిక్కడ పళ్ళెములో వుంచి యీమిఠాయివుండలు యీచిన్నదానికి అందిస్తూవుండు.

కర -- (దగ్గరకువచ్చి పళ్ళెము బోర్లించుచున్నాఁడు)

రామా -- ఓరినిర్భాగ్యుడా! నీకు మతిపోయినట్టువున్నదే. పళ్ళెం బోర్లించినావేమి? అదితిన్నగాతీసి యీమిఠాయివుండ మోహిని కందియ్యి.

కర -- (పుచ్చుకొని తానేతినుచున్నాఁడు)

రామా -- ఓరి నిర్భాగ్యుడా! నీకు పిచ్చియెత్తినదాయేమి? (తనలో) దీని సౌందర్యంచూస్తే వీడికీ ఆశకలుగుతూవున్నట్టున్నది. అయినా వీడిమనస్సు పరీక్షచేసి చూస్తాను. (ప్రకాశముగా) ఈమె సౌందర్య వర్ణించడానికి శక్యమైనదికాదు.

కర -- ఆరంభంలో అలాగేకనుపడుతుంది కానితరువాత -

రామా -- ఆమందహాసము సొగసు చూచినావా?