అంతర్గతకాలము
55
యెడల వ్యాధి పెంపు తక్కువగనుండును. అప్పుడు అంతర్గత కాలము ఎక్కువ కావచ్చును. ఒక్కొకప్పుడు రోగిబలమయిన వాడైనయెడల వ్యాధి బయటపడక పోవచ్చును. సూక్ష్మ జీవులమోతాదు హెచ్చినకొలదిని రోగి బలహీనుడైనకొలదిని రోగము మిక్కిలి తీవ్రముగను, శీఘ్రముగను పరిణమింప వచ్చును. అప్పుడు అంతర్గతకాలము తగ్గిపోవును. సూక్ష్మ జీవులు కొంతవరకు శరీరములోనున్నను, వ్యాధి పైకి తెలియక పోవచ్చు ననుటకొక నిదర్శనము చెప్పెదము. రమారమి లక్ష నెత్తురు కణములకొక్క చలిజ్వరపు పురుగుచొప్పున మన శరీరములోనున్నప్పుడే జ్వరముపైకి కనబడును. కాని లక్ష కొక్కటికంటె చలిజ్వరపు పురుగులు తక్కువగ నున్నయెడల జ్వరము బయటకురాదు. సాధారణముగా మన దేశమున వ్యాపించియుండు అంటువ్యాధులయొక్క అంతర్గత కాలమును, వ్యాధియొక్క సూచనలుకొన్ని బయట పడిన తరువాత నది ఫలానా వ్యాధియని నిశ్చయముగ తెలిసికొనుట కెన్నటికి సాధ్యమగునో ఆదినముయొక్క సంఖ్యయు, వ్యాధియొక్క ప్రారంభించు దినసంఖ్యయు వ్యాధి పీడితుడగు రోగితో నెన్ని దినములవర కితరులు సంపర్కముకలిగి యుండకూడదో ఆ దినముల సంఖ్యయు, వ్యాధి కుదిరిన పిమ్మట రోగిని స్వేచ్ఛగ నితరులతో నెప్పుడు కలిసి మెలసి తిరుగనియ్య వచ్చునో ఆ దినములసంఖ్యయు తెలియజేయుపట్టీ నొక దాని నీ క్రింద జేర్చి యున్నాము.