ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక


అంటువ్యాధులను గూర్చిన ఈ గ్రంథములోని ఇంచుమించు అన్నివిషయములను ఆంధ్రవిజ్ఞాన సర్వస్వమునకొక వ్యాసముగా వ్రాసియుంటిని. ఇపు డనేకులు దీనినొక ప్రత్యేక గ్రంథముగా ప్రకటించిన మిక్కిలి యుపయోగముగా నుండునని వ్రాసియున్నందున సర్వస్వము వారి అనుమతిమీద దీనినిట్లు సంపుటముగా ముద్రింపించితిని.

ఇందిపుడు ‘కలరా,’ ‘సన్నిపాతజ్వరము,’ గ్రహణి విరేచనములు,’ ‘మశూచకము,’ ‘తట్టమ్మ (పొంగు)’ ‘ ఆటలమ్మ,’ ‘కోరింతదగ్గు,’ ‘గవదలు,’ ‘డెంగ్యూజ్వరము,’ ఇౝప్లూఇంజా,’ ‘న్యూమోనియా,’ ‘పచ్చసెగ,’ ‘కొరకు,’ ‘అడ్డగర్రలు,’ ‘తామర,’ ‘శోభి,’ ‘గజ్జి’ మొదలగు వ్యాధులను గూర్చి విపులముగా ఏబదిపుటలవరకువ్రాసి పెంచియున్నాను.

జనసామాన్యమునకు సుభోధక మగుటకు గాను శాస్త్ర సంబంధమైన విషయములనుగూడ సాధ్యమైనంత సులభశైలిని వ్రాసియుంటిని. ఒకేవిషయమును గూర్చి రెండుమూడు ప్రదేశముల, మరింత బాగుగా మనస్సున నాటుటకుగాను, వివరించి యుంటిని. ఇట్టి పునరు క్తిదోషమును మన్నింతురుగాక.