ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

44

మూడవ ప్రకరణము


సాధారణముగ అన్నిజాతుల సూక్ష్మజీవులును చీకటిలో చక్కగ పెరుగును. మిక్కిలిప్రకాశమయిన వెలుతురు వలన వాని వృద్ధితగ్గి అవి క్రమక్రమముగ నశించును. సూక్ష్మ జీవులకంటె వాని గ్రుడ్లు ఎండ వేడి తడి వెలుతురు మొదలగు వానిచే సులభముగ హాని జెందవు. మసలుచున్న నీళ్లలో తల్లిసూక్ష్మజీవులు చచ్చినను, వానిగ్రుడ్లు కొన్ని ౧౩౦ డిగ్రీల వేడివచ్చువరకు బ్రతికియండును. పశువులకు గాళ్ళు కలిగించు సూక్ష్మజీవులు పచ్చిక బైళ్లలోని పచ్చగడ్డి చాటుననుండు నీడలో అనేక సంవత్సరములు జీవింపగలవు.

సామాన్యముగ మనుష్యులకంటు వ్యాధులను పరిశీలించి చూడగ సూక్ష్మజంతువులు, శిలీంధములు, బాక్టీరియములు, ఈ మూటిలో బాక్టీరియములు ఎక్కవ వ్యాధిని కలుగజేయునని యీ క్రింది పట్టీని గమనించిన తెలియగలదు.

  1. సూక్ష్మ జంతువులచే గలుగు వ్యాధులు.
    1. నాలుగువిధములగు చలి జ్వరములు.(Malaria)
    2. అమీబిక్ డిసెంటరి (Amoebic Dysentery) ఒక విధమయిన రక్తగ్రహిణి.
  2. శిలీంధముచే గలుగువ్యాధులు. (Fungi)
    1. ఒక విధమైన నోటిపూత (Thrushi)
    2. ఒకవిధమైన సర్పి (Herpes)
    3. తామర (Ringworm)