ఈ పుట ఆమోదించబడ్డది

42

మూడవ ప్రకరణము.


జీవులు పెరిగి వ్యాధిని పుట్టించునుగాని తమకుతగిన శరీరపు వేడిమిలేని జంతువులలో నవి బ్రతుకజాలవు. అనగా మనుష్యులలో వ్యాధిని గలిగించు కొన్నిసూక్ష్మజీవులు చేపలు కప్పులు, మొదలగు నీటి జంతువులలో ఎట్టి వ్యాధిని గలిగింపనేరవు. మానవులకు వచ్చుకలరా వ్యాధి మన ఇండ్లలోనుండు కుక్కలకును, పిల్లులకును రాదు. కొన్ని వ్యాధులను గలిగించు సూక్ష్మ జీవులు ఎంత ఎండనైనను వేడినైనను భరించి సంవత్సరముల తరబడి బ్రతుకును. సూక్ష్మ జీవుల అయుర్దాయము ఆ యా జాతినిబట్టి యుండును. దొమ్మ “అంథ్రాక్సు” (Anthrax) సూక్ష్మజీవుల గ్రుడ్లు సీలుచేసిన గొట్టములలో ౨౨ సంవత్సరముల వరకు బ్రతికియుండెనని “పాస్‌టర్ ” (Pasteur) అను నతడు కనిపెట్టెను. క్షయ వ్యాధిని కలిగించు సూక్ష్మజీవులు ఎండిపోయిన కఫములో ౯౫ దినములు బ్రతికియుండి యటు పిమ్మట ఇతరులకు ఆ వ్యాధి నంటింప గలిగియుండెనని రుజువు పడినది. ఇట్టుగాక కలరా మొదలగు కొన్ని వ్యాధులను గలిగించు మరికొన్ని సూక్ష్మ జీవులు ఒకటిరెండు గంటల వేడికే తాళజాలక చచ్చిపోవును. అనేక సూక్ష్మజీవులను గుచ్చెత్తిన మిశ్రమ కషాయములో తమకు అనుకూలమగు స్థితిగతులుగల కొన్నియే బ్రతికి మరికొన్ని చచ్చిపోవును. కొన్ని సూక్ష్మ జీవులనుండి పుట్టు పదార్థములు మరికొన్ని సూక్ష్మజీవులకు విషములయి వానిని నశింపచేయును. టయిఫాయిడ్ (Typhoid)