ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవుల కనుకూలమగుస్థితిగతులు

39


పదార్థములను తిని బ్రతుకుచుండును. ఈ పాకీవాండ్ర సహాయము లేకపోయిన మన మొక్కొకప్పుడు కడుపుబ్బి చావ వలసివచ్చును.

సూక్ష్మజీవుల కనుకూలమగుస్థితిగతులు

ఇవి వ్యాపింపజాలని స్థలములేదు. గాలియందు సముద్రముమీద, కొండలమీద, నీటియందు మంచునందు ఆకాశమునందు వీని యన్నిటియందును ఈ సూక్ష్మజీవులను కనిపెట్టియున్నారు. ఈ సూక్ష్మజీవులలో కొన్ని ప్రాణవాయువున్న చోట్లగాని జీవింపజాలవు. మరికొన్ని ప్రాణవాయువులేని చోట్ల గాని జీవింపజాలవు. కొన్ని ప్రాణవాయువుండినను లేకున్నను జీవింపగలవు. “టిటనస్” (Titanus) అను ధనుర్వాయువును కలుగజేయు సూక్ష్మజీవి ప్రాణవాయువు ఉండుచోట జీవింప జాలదు. “ఆంథ్రాక్సు” (Anthrax) అనుదొమ్మ వ్యాధిని పుట్టించు సూక్ష్మజీవి ప్రాణవాయు వుండినగాని జీవింపజాలదు.

సూక్ష్మజీవులు నివసించు ప్రదేశమునందుండు అహార పదార్థము ద్రవరూపముగ వాని నావరించియుండు పొరగుండ వాని శరీరములో ప్రవేశించి వానిని పోషించును. బాక్టీరియములలో కొన్ని జంతువులవలెనే బొగ్గుపులుసు గాలిని విడిచి వేయును. మరికొన్ని ఆకు పచ్చని రంగుకలిగి వృక్షములవలె బొగ్గుపులుసు గాలిని పీల్చుకొని ప్రాణవాయువును విడిచి వేయును. కొన్ని బాక్టీరియములు పై రెండు పటములలో