ఈ పుట ఆమోదించబడ్డది

36

మూడవ ప్రకరణము

తగుకాలము వచ్చువరకు పడియుండి వర్షా కాలమురాగా తగిన తరుణము దొరికినదని మొలకరించి అతివేగముగ వృద్ధిజెందును. 17-వ పటము చూడుము.

17-వ పటము

దొమ్మ సూక్ష్మజీవులగ్రుడ్లు మొలకరింపక పూర్వముండు రూపము

క్రింది పటమునందు సూక్ష్మజీవుల గ్రుడ్లెట్లు మొకలరించి వృద్ధియగునో చూపబడియున్నది.

18-వ పటము.

పగలు 11 గంటల కొక సూక్ష్మజీవి గ్రుడ్డొక చుక్కవలెనున్నది.
12 గంటల కీ గ్రుడ్డు కొంచె ముబ్బియున్నది.
3-30 గంటలకు దీనినుండి చిన్న మొటిమ యొకటి పుట్టియున్నది.
6.గంటల కీమొటిమ పెద్దదై ప్రత్యేక సూక్ష్మజీవులుగా నేర్పడుటకుసిద్ధముగా నున్నది.
8.30 గంటలకు దీనినుండి అయిదు సూక్ష్మజీవుల యాకార మేర్పడియున్నది.
రాత్రి 12 గంటలకు 17 సూక్ష్మజీవులు పూర్ణముగ నేర్పడియున్నవి. త్వరలో నివియన్నియు విడిపోయి తిరిగి పిల్లలను పెట్టుటకు ప్రారంభించును.