ఈ పుట ఆమోదించబడ్డది

28

మూడవ ప్రకరణము

సూక్ష్మజంతువులలో కొన్ని తమమూలపదార్థములో ఒకభాగమును పాదము (Psudopodium) గా సాచి దాని సహాయముతో ఆహారము నిమిడ్చుకొనును. ఇట్టిజంతువునకు (అమిబా Amoeba) వికారిణి అనగా ఆకారము నిరంతరము మార్చు కొనునది అని పేరు. 7-వ పటములోనిది యాహారమును పట్టుకొను విధమును చూడనగును. చలిజ్వరము (Malaria) అను జ్వరమును “అమీబిక్ డిసెంటరీ (Amoebic Dysentery) అను నొకతరహా జిగట విరేచనములను గలిగించు సూక్ష్మ జంతువులును ఈ జాతిలోనివియే. మరికొన్ని సూక్ష్మజంతువులు తోకలు కలిగి వాని సహాయముచే ఈదుచు ఆహారమునుతినుచు పరుగెత్తుచుండును. 8-వ పటము చూడుము:

8-వ పటము

మృ-రో.

మృదురోమములను తోకలుగలిగి వానిసాయముచే చలింపగల సూక్ష్మ జంతువు.

మృ. రో =మృదురోమములు.

జీ = జీవస్థానము. ఇందు అనేక జీవస్థానములు గలువు.