ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము


 
సూక్ష్మజీవుల జాతి భేదములు

పైని చెప్పినట్లెక్కడ శోధించినను కనబడు అపరిశుద్ధప్రదేశములలో నివసించు సూక్ష్మజీవులెట్టి యాకారము గలవి? వానియందలి భేదము లేవి? అవి యేమి తిని బ్రతుకును? ఈ విషయమును సంక్షేపముగా నాలోచింతము.

౧. కొన్ని జాతుల సూక్ష్మజీవులు మనవలెనే ప్రాణ వాయువుండుచోట్లగానీ జీవింపనేరవు. ఇందు కొన్నిపులులు, సింహములవలె ప్రాణముండు భాగములను మాత్రము తిని బ్రతుకును. మఱికొన్ని కాకులు కోళ్ళవలే ప్రాణములేక క్రుళ్లిపోవు భాగములనుకూడ తినును. తమనడవడికలలో సామాన్యముగా నీపై రెండుజాతులును జంతువులను బోలియుండుట చేత వీనికి సూక్ష్మ జంతువులు (Protozoa) అనిపేరు. వీని యాహారము కేవల జంత్వాహారము (Holozoic Nutrition)

౨. మఱికొన్ని జాతుల సూక్ష్మజీవులు కుక్కగొడుగుల వంటివి. ఇవి క్రుళ్లుచుండు పదార్థములలో మాత్రమే పెరుగును. సజీవములగు జంతువులనుగాని వృక్షములనుగాని యివి తినజాలవు. వీని యాహారము పూతికాహారము (Sapro-