ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిది సూత్రములు

23

ప్రక్కవాని ఇల్లుగాని, ప్రక్కనుండు వీధిగాని మలినముగ నున్నయెడల మీ ఇల్లు శుభ్రముగనుండినను ఏమి ప్రయోజనము ? గాలివచ్చి యంతయు నేకము చేయును. కాబట్టి యిరుగు పొరుగు వారలకుగూడ నీకు తెలిసి నంతవరకు బోధించి వారి వారి ఆవరణములను, వీధులనుకూడ శుభ్రముగ నుంచుటకు సహాయపడుము.

తొమ్మిది సూత్రములు

అమెరికా దేశములో సర్కారుచే నియోగింపబడిన కొన్నిసామాన్య సూత్రములను చూచినయెడల ఈగలను రూపుమాపుటయందు వారికిగల శ్రద్ధ తెలియగలదు.

  1. రోగివద్దకు ఈగను రానియ్యవద్దు.
  2. ఈగ రోగి గదిలోనికి వచ్చినయెడల దానినివిడువక పట్టి చంపివేయుము. దానిని సులభముగ పట్టుటకు జిగురుకాగితములమ్మును.
  3. క్రుళ్లుచుండు పదార్థమును ఇంటిలోపలను, చుట్టు ప్రక్కలను చేరనీయకుము అనుమానముగల చోటులందెల్ల పొడిసున్నమునుగాని కిరసనాయిలునిగాని చల్లుము.
  4. ఆహార పదార్థములమీద యీగవ్రాలకుండ మూసి పెట్టుము. భోజనముకాగానే యెంగిలాకులను, కంచములను తెరచియుంచకుము. వెంటనే శుభ్రముచేయుము.