ఈ పుట ఆమోదించబడ్డది

మురుగుకుండు

19

చూడవచ్చును. ఈ నూతిదగ్గరనే స్నానములు. తలంట్లనాడు పదిబిందెలనీళ్లతో స్నానము చేసినయెడల రెండు మూడు బిందెలకంటె ఎక్కువబయటికిపోవు. మిగిలినదానిలో సగమయినను తిరిగి నూతిలో చేరును. నూతిలోనినీళ్లన్నియు, తోడి పోసికొనినను మా నీరు మా నూతిలోనే చేరుచున్నదని కొందరు సంతోషింపవచ్చును. ఇక్కడనే కుమ్మరి పురుగులను, ఏలుగు పాములను, చక్కని ఎరుపురంగుగలిగి మిసమిసలాడు చుండు కుంకుడుకాయ పురుగులను మిక్కిలి తరుచుగచూడనగును. బురబురలాడు బురద స్నానము చేసినవారి కాలికంటి కొనకుండ అక్కడక్కడ అరగజమున కొకటిచొప్పున రాళ్లు గాని ఇటుక ముక్కలుగాని పరచియుండును. ఇక్కడ నుండి అప్పుడప్పుడు మించిపాకి పోవు బురుదనీరు వీధిని పడకుండ కట్టిన మురుగుకుండును చూడవలెను.

మురుగుకుండు

దాని పేరే దానిని వర్ణనాతీతముగ జేయుచున్నది. దానిమీద చీకిపోయిన పాతతలుపున్నను ఉండవచ్చును. దాని లోని నీటినెత్తి దినదినము పారబోసి, బురదమట్టి నెత్తివేసి శుభ్రపరచవలెనని దానిని కట్టినవారి యుద్దేశము. అది నిజముగ గజములోతున్న యెడల ముప్పాతికగజము వరకు కుళ్లు మట్టి దిమ్మ వేసికొనిపోయి యుండును. పైనుండు పాతికగజముతోని నీటిని ఎత్తువారులేక, గొయ్యి నిండిపోయి, వీధిని బడి