18
రెండవ ప్రకరణము
గంజి, కూరనీళ్లు, రాతిచిప్పలు కడిగిననీళ్లు వచ్చుటకు దారి ఉండును. లేదా వంటఅయిన తోడనే లోపలనుండి శ్రమపడి తెచ్చి యీ సందులో పారబోయుదురు. ఇక్కడనే రుబ్బు రోటికి స్థలము. ఈ సందులోనే యొక ప్రక్కన కుడితిగోలెముండును. నాలుగు నాళ్లవరకు గొడ్లవాడు తీసికొని పోక పోయినయెడల గోలెములోనుండు పుచ్చు వంకాయ ముక్కలు, గుమ్మడికాయలోని బొరుజు, ముదిరిపోయిన అనపకాయ బెండకాయ ముక్కలు నూరుచుండగా దాని రుచియు కంపును పశువులకే తెలియవలెను. ఈ సందులో ఎదురుగోడ దరిని సాధారణముగ బురదగనుండు నొకమూలనుండి వెలువడు కంపును వర్ణింప నలవికాదు. గంజి వాసనయా, కుడితి వాసనయా, పేడనీళ్లు వాసనయా, ఏదియో చెప్పలేము. కంచములు, కూరకుండలు కడుగునీళ్లు ఇక్కడనే చేరును. అలుకు గుడ్డయు చీపురుకట్టయు ఇక్కడ యెండుచుండును. చేతులు కడుగుకొనుటకు నీళ్లబిందెలును చెంబులును ఇక్కడ నుండును. ఈ సందులోనుండి నూతిదొడ్డిలోనికి పోవుదము.
నూతిదొడ్డి
ఇల్లంతయు గచ్చుచేయించిన వారిండ్లలోకూడ నూతి వద్దనుండు క్రుళ్లు తప్పదు. కుంకుడుకాయత్రొక్కులు, తల వెండ్రుకల చిక్కులు; ప్రాతగుడ్డ పేలికలు, చింకిరి చేదలు, పాత త్రాటి ముక్కలు వీని నన్నిటిని నూతిచుట్టును ఎల్లప్పుడు