ఈ పుట ఆమోదించబడ్డది

141

దినమును కొంచెము కొంచెముగా నీడ్చుచు పుల్లకు చిట్టి పెట్టుచు కొన్ని దినములలో పురుగు నంతను బయటకు లాగి వేయుదురు. కురుపు తేలక బాధ యెత్తు చున్నప్పుడు బోరిక్ పవుడర్ వేసి కాచిన నీళ్లతొ పిండిన వేడి వేడి గుడ్దతో అప్పుడప్పుడు వత్తు చుండ వచ్చును. లేదావేడి నీళ్లలోముంచి పిండిన బోరిక్ లింటును వెచ్చ వెచ్చగ వేసి కట్టవచ్చును. ఉమ్మెత్త ఆకులను వెచ్చ జేసి కట్టిన కూడ నొప్పి హరించును. నూరిన ఉమ్మెత్తాకులను సరికి సరిగా వరి పిండియు కలిపి నీటితో ముద్దగా నుడికించి ఇది వేసి కట్టవచ్చును.

నివారించు పద్ధతులు

నారి పురుగునకు సహజముగ నీటి యందభిలాష అధిమనియు నీటి యొక్క సంపర్కము కలిగినప్పుడు ఇది తన పిల్లలను వేగముగ బయటికి విడిచి వేయుననియు పైన చదివి యున్నాము. నీరు లేని చోట్ల అనగా పొడి నేలల యందు ఈ పురుగు పిల్లలు మిక్కిలి సులభముగా చచ్చి పోవుననియు చదివి యున్నాము. సామాన్యముగా నారి పురుగు పిల్లలు నీటిలో పడిన వెంటనే ఆనీటి యందుండు మిక్కిలి సూక్ష్మములగు రొయ్య జాతి జంతువుల శరీరములోనికి చొచ్చుకొని పోయి వాని శరీరములో పెరుగును. ఈ జంతువులలో ప్రవేశించిన తరువాత నాలుగు వారములలో ఇవి రూప నిష్పత్తి చెంది అంగుళములో 20 వ వంతు పరిమాణము గలవి యగును. ఆ జంతువులు మనకు త్రాగు నీటితో పాటు మన కడుపులో పడి జీర్ణమై పోయినప్పుడు