ఈ పుట ఆమోదించబడ్డది

225

వివరముగ బోధించు పాఠములను పాఠశాలలో తప్పక భోదింప వలెను. ఈ పద్ధతి వలన పటాలములలో ఈ వ్యాధులు కొంత వరకు లొంగు బాటునకు వచ్చుచున్నవి.

తామర

ఇది 13. వ పటములో చూప బడిన బూజు జాతి సూక్ష్మ జీవిచే కలుగు చున్నది. ఇందనేక జాతులు కలవు. తల వెండ్రుకలలో వచ్చున దొక జాతి. గజ్జలు మొదలగు స్థలములలో శరీర మందు వచ్చున దొక జాతి. గోళ్లలో వచ్చున దొక జాతి. ఇట్లనేక జాతులు గలవు. గోళ్లలో వచ్చు తామరకే పుప్పి గోళ్లని చెప్పుదురు.

ఇది వ్వాపించు విధము

ఇది కుంటుంబములోను బడులలోను ఒకరి బట్టలొకరు కట్టు కొనుట చేతను ఒకరి దువ్వెనలు మంగల కత్తులు టోపీలు తువాళ్లు మొదలగు వని మరియొకరు ఉపయోగించుట చేతను వచ్చును.

నివారించు పద్ధతులు

కొంచెము జాగ్రత్తగ మనము ప్రయత్నించిన ఈ వ్వాధి వ్వాపింప కుండ చేయ వచ్చును. ప్యారిస్ పట్టణములో తారమ యంటిన పిల్లకు ప్రత్యేకమైన స్కూళ్ళు గలవు. మన దేసములో అంత వరకు మనము పోలేక పోయినను సామాన్యముగ మనము చూపగలిగిన శ్రద్ధను చూపి వ్యాధి గల పిల్లలను తరగతిలో వేరుగ కూర్చుండ బెట్ట వలెను. పిల్లలంద