ఈ పుట ఆమోదించబడ్డది

221

3. ఈ పుండు ఒంటిగ నుండును గాని ఒక చోట నుండి మరియొక చోట నంటదు.

4. దీని విషము గజ్జలలోని కెక్కినప్పుడు అక్కడ బిళ్లలు కొంచెము ఉబ్బి గట్టిగ నుండును గాని దానిలో చీము పట్టదు.

ఈ వ్వాధులు మానవులకు మాత్రము అంటును. ఇతర జంతువులకు మనము బలవంతముగ ఏ విధమున అంటించినను అంటవు. ఇవి వ్యాధి గలిగిన మానవుల నుండియే ఎతర మానవులకు అంటును గాని తమంతటవి ఎవ్వరికిని వ్యాధిగ్రస్తుల సంపర్కము లేదిదే పుట్టవు. ఇవి సామాన్యముగ స్త్రీ పురుష సంయోగముచే వ్వాధి గల స్త్రీల నుండి పురుషులకును, ఈ పురుషుల నుండి తిరిగి ఇతర స్త్రీలకును అంటును. స్త్రీల అవయవముల నుండి ఎప్పటికప్పుడు చీము మొదలగునవి బయటకు పోవుటకు తగినంత అవకాశముండుట చేత ఒక్కొకప్పుడు వీరలను పచ్చ సెగయు, అడ్డ గర్రలను మగ వారలను బాధించి నంతగా బాధింపవు గాని కొరుకు వ్వాధి స్త్రీల యెడల పక్ష పాతమును సామాన్యముగా జూపదు.

నివారించు పద్ధతులు

1. యుక్త వయస్సు వచ్చిన మగ వానికి అయిదారు సంవత్సరముల పిల్లను కట్టి పెట్టినప్పుడు మనస్సు పట్టాజాలని వారలు తప్పుదారుల నడుచుట వలన ఈ వ్వాధులు మన దేశమున