ఈ పుట ఆమోదించబడ్డది

216

యుండుట చేత ఈ సిద్ధాంతము నిలువ జాలదు. నల్లుల మూలమున గాని మన ఇండ్లలో నుండు ఎవో ఇతర జంతువుల మూలమునగాని ఈ వ్యాధి వ్యాపించు చున్న దేమో యను సందేహము కలదు. ఈ విషయమును కని పెట్టుటకు అనేకులు శోధనలు చేయు చున్నారు.

నివారించు పద్ధతులు

కుష్ఠ వ్వాధిగల రోగులను వేరు పరచి ప్రత్యేక స్థలములలో నివసింప జేయవలయు ననుటకు సందేహము లేదు. ఇంగ్లండు దేశమునందు క్రీ.శ. 1200 ల సంవత్సర ప్రాంతమునందు ఈ వ్యాధి మిక్కిలి ఉధృతముగ వ్యాపించి యుండి ప్రత్యేకము కుష్ఠ రోగుల నిమిత్తమై 95 వైద్య శాలలు ఏర్పడి యుండెను. ఇట్లు రోగులను ప్రత్యేక పరచి 1800 వ సంతత్సరము నాటికి లెక్క కొక్క డైనను కుష్ట రోగి లేకుండు నట్లు ఆ దేశము వారు చేసికొన గలిగిరి. కాబట్టి ఈ వ్యాధి నిర్మూలనము చేయ వలెననిన రోగుల యొక్క సంపర్కము లేకుండ జేసి కొనుటయో సాధనము. ఈ దేశమునందు కుష్ఠ వ్యాధి గల వారిలో సగము మందికిది కాళ్ళలో ప్రారంభించుట చేత కుష్ఠ రోగులు తిరుగు చున్న చోట్ల నేల యందీ సూక్ష్మ జీవులు రాలి యుండి పాదరక్షలు లేకుండ నడచు వారికి ముఖ్యముగ అంటునని తోచుచున్నది. కుష్ఠ రోగుల బజారులో ఎవస్తువులను అమ్మరాదు. వీరి ఉమ్మి యందును చీమిడి యందును స్త్రీ పురు